ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలను నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ పై ఆయన పలు ప్రాంతంలో పర్యటించి వరద బాధితులకు ఆహారం మరియు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.