ఉంగుటూరు: రేపు పలు గ్రామాలకు పవర్ కట్
ఉంగుటూరు నియోజకవర్గంలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు నారాయణపురం ఏఈ శ్రీరామ్ తెలిపారు. ఆ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంగుటూరు నుంచి చేబ్రోలు పోలీస్ స్టేషన్ వరకు, రాజుల కాలనీ, గణపవరం రోడ్డు, అరుంధతి కాలనీ, ఉషోదయ స్కూల్ ఏరియా, అపార్ట్మెంట్లు నుంచి తల్లాపురం వరకు కరెంట్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.