ఈనెల 6 నుంచి 21 వరకు గ్రామ స్థాయి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆచంట తహసీల్దారు కనకరాజు తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులలో రైతులు వారి భూముల వివరాలు, సర్వే సమస్యలు, ఇతర భూ సమస్యలు, ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. గత సదస్సులలో వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం పరిష్కరించామన్నారు. దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ చేసి రసీదు ఇస్తామని స్పష్టం చేశారు.