పెదవేగి మండలం నడిపల్లి జనసేన మెగా వాలీబాల్ టోర్నమెంటును శుక్రవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన యువకులతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.