దెందులూరులో వైసీపీ ఎన్నికల ప్రచారం

51చూసినవారు
ఏలూరు జిల్లా దెందులూరు గ్రామంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రచార రథంపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్