ఏలూరు జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవిన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 281 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో శనివారం నిర్వహించిన 27 రెవెన్యూ సదస్సుల్లో 981 మంది పాల్గొని ఆయా సమస్యలపై 363 అర్జీలను అందజేయగా, అప్పటికప్పుడే 79 అర్జీలు పరిష్కరింపబడ్డాయన్నారు. రెవిన్యూ సదస్సులలో అందిన విజ్ఞప్తులను 45 రోజులలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.