పాలకొల్లు: వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూలా నక్షత్ర పూజలు

55చూసినవారు
పాలకొల్లు పట్టణం స్థానిక కూరగాయల మార్కెట్ లో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని సరస్వతి పూజను నిర్వహించారు. దేవస్థానం తరఫున పూజలో పాల్గొన్నటువంటి చిన్నారులకు పూజ సామాగ్రిని, మన్యం జగ్గమ్మ సత్రం తరుపున పుస్తకములు, పెన్నులు వితరణగా అందజేశామని ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్