కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి పెట్టుబడి సాయాన్ని వెంటనే విడుదల చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు చిర్ల పుల్లారెడ్డి, మండల కార్యదర్శి సిరపరపు రంగారావు డిమాండ్ చేశారు. వరి ధాన్యంలో ప్రభుత్వం తేమ శాతం సడలించాలని, రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం పెంటపాడు మండలం పెంటపాడులో రైతులు, కౌలు రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.