వరిఘేడులో వరసిద్ధి వినాయకుని ఊరేగింపు
అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో ఆదివారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయకుని ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. విచిత్ర వేషధారణలు, కోలాట ప్రదర్శనలు, బాణసంచా కాల్పులతో స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో వరిఘేడు గ్రామ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.