పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలలో గ్రామ సింహాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధాన రహదారులపై గుంపులు గుంపులుగా కుక్కలు తిష్ట వేసి కూర్చుని ఉండడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కావున నగర పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.