ఉండి: తాము చదివిన పాఠశాలకు కుర్చీలు అందజేసిన పూర్వ విద్యార్థులు
ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అవసరమైన కుర్చీలను పూర్వ విద్యార్థులు 2010/11 పదవ తరగతి బ్యాచ్ పోతుల సత్య నాగ పద్మారావు మరియు జల్లి అచ్యుత్ లు ఉదార స్వభావంతో బుధవారం 50 నీల్ కమల్ కుర్చీలు అందజేశారు. వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి మహేష్ బాబు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చెల్లింకి మస్తాన్ రావు అభినందించి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.