భీమడోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో చెట్లకొమ్మల తొలగింపు, కండక్టర్ల మార్పు నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ కేఎం అంబేద్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలసానిపల్లి, భీమడోలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.