పెంటపాడు: పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
పెంటపాడు మండలం ముదునూరు గ్రామం వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. స్టీరింగ్ వదిలేయడంతో బస్సు నేరుగా కాల్వలోకి దూసుకెళ్లిందని డ్రైవర్ దుర్గా సాయి తెలిపాడు. బస్సులో సుమారు 25మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఓ కండక్టర్, మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలైనందున ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారందరూ సురక్షితంగా బయటపడటంతో వారిని భీమవరం వెళ్లే బస్సులో తరలించారు.