అర్హులైన పేదలందరికీ 2 ఎకరాల భూమిని
కేటాయించాలని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి గాలి చంద్రా పేర్కొన్నారు. సోమవారం జమ్మలమడుగు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు రెండెకరాల భూమిని కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.