గండికోట జలాశయంలో 26.28 టీఎంసీల నీరు
కడప జిల్లా గండికోట జలాశయంలో శుక్రవారం 26. 28 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయంలో 695. 08 అడుగుల వద్ద నీటిమట్టం ఉందని వెల్లడించారు. జలాశయంలో ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో గాని ఏమిలేదన్నారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో నీటి నిలువ నిలకడగా ఉన్నట్లు జలవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు పేర్కొన్నారు.