VIDEO: బిగ్ బాస్ హౌస్లో అర్థరాత్రి గంగవ్వ కేకలు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. అయితే వైల్డ్ కార్డ్ సహాయంతో వెళ్లిన గంగవ్వకు గుండెపోటు వచ్చిందని తాజాగా ఓ న్యూస్ వైరలైంది. ఆ వార్త వాస్తవం కాదని మై విలేజ్ య్యూటూబ్ ఛానెల్ వాళ్లు క్లారిటీ ఇచ్చారు. అయితే హౌస్లో గంగవ్వ అర్థరాత్రి లేచి కేకలు పెట్టినట్లు ప్రోమో రిలీజ్ చేశారు. ఆమె కేకలకు హౌస్లో ఉన్న అందరూ ఉలిక్కిపడి లేచారు. గంగవ్వను చూసి కంటెస్టెంట్స్ గజగజ వణికిపోయారు. అయితే ఇది అంతా ఫ్రాంక్ అని తర్వాత తేలిపోయింది.