రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు
గురు నానక్ జయంతి సందర్భంగా శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తెరుచుకోవు. దీంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు నాలుగు రోజులే పనిచేసినట్టు అయింది. మళ్లీ సోమవారమే కార్యకలాపాలు జరగనున్నాయి. కాగా, స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మొత్తం నష్టాల్లోనే కొనసాగాయి.