Mar 09, 2025, 18:03 IST/
భారత జట్టుకు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్
Mar 09, 2025, 18:03 IST
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "టోర్నీ అంతటా అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ, ఆటలోని ప్రతి అంశంలోనూ ప్రతిభను ప్రదర్శించడం.. అజేయంగా నిలిచి ట్రోఫీని అందుకోవడం భారత జట్టు అంకితభావం మరియు శ్రేష్ఠతకు నిదర్శనం. టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను." అని పవన్ రాసుకొచ్చారు.