ఆహా ఏమి రుచి అన్నట్టు మైమరిపించేలా పలు రకాల వంటకాలను తయారుచేసి గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జిఎంఎస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రదర్శించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో సుమారు 100 మంది పేరెంట్స్ వివిధ రకాల ఆధునిక సంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు.