ఎడ్ల బండిని బైక్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి పెంబి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని సెట్పల్లి గ్రామానికి చెందిన పవర్ రాజు తన కొడుకు అఖిల్ తో కలిసి బైక్ పై పెంబి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందగా, రాజు, అఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అఖిల్ మృతి చెందాడు.