రూ.400 సంపాదిస్తున్న కార్మికుడికి రూ.232 కోట్ల పన్ను నోటీసు
రోజుకు కేవలం రూ.400 సంపాదించే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఎంబ్రాయిడరీ వర్కర్‌కు దిల్లీ ఆదాయపు పన్ను శాఖ రూ.232 కోట్ల పన్ను నోటీసు పంపింది. దుబాయ్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసగాళ్లు 2018లో ఆ కార్మికుడి నుంచి ఆధార్, పాన్ కార్డులను తీసుకున్నారు. ఆ తర్వాత వారు ఒక నకిలీ కంపెనీని సృష్టించడానికి, పలు లావాదేవీలను జరపడానికి అతని ధ్రువపత్రాలను వాడడంతో బాధితుడికి పన్ను నోటీసులు వచ్చాయి.