మంచిర్యాల
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ ను బుధవారం టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీఎస్ వ్యవస్థను రద్దుచేసి పాత పెన్షన్ విధానం, పీఆర్సీ అమలు చేయాలని, 317 జిఓ బాధితుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆయన కోరారు.