తెలంగాణలో రేషన్ కార్డులపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. గ్రామసభల్లో నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. పదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామనితమ ప్రభుత్వం మాట ఇచ్చిందని గుర్తుకుచేశారు.