బస్సు సరిపోక అయిజలో ప్రయాణికుల ఆగ్రహం

78చూసినవారు
బస్సు సరిపోక అయిజలో ప్రయాణికుల ఆగ్రహం
అయిజ నుండి హైదరాబాద్ కు ఆదివారం రాత్రి 11 గంటలకు బయలుదేరాల్సిన బస్సుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు తరలి రావడంతో బస్సు సరిపోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొక బస్సు ఏర్పాటు చేయాలని గద్వాల డిపో మేనేజర్‌ను కోరినా సరైన స్పందన లేకపోవడంతో బస్సును కదలనివ్వకుండా అడ్డుకున్నారు. అధికారులు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వారి అసమర్థతకు, నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్