డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష కమిటి
తెలంగాణ రాష్ట్రం రాకపూర్వము కర్నూల్ డిపో నుండి అయిజ మీదుగా రాయచూర్ బస్సులు గద్వాల డిపో నుండి ఉన్నాయి. అయిజ నుండి మంత్రాలయం వరకు ఒక్క బస్సు మాత్రమే ఉన్నది. దీంతో సుమారు 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గట్టు మండలం అనేక ప్రాంతాల ప్రజలు తెలంగాణ బస్సు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయిజ నుండి బలిగెర మీదుగా ఎరగెర వరకు బస్సులు నడపాలని డిపో మేనేజర్ కు శుక్రవారం అఖిల పక్ష కమిటి వినతి పత్రం అందజేసింది.