ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు రూపొందించేల ముఖ్యమంత్రి చొరవ చూపేల ఒప్పించాలని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి టీఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యసలహాదారు వేం నరేందర్ రెడ్డిని కోరారు. శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలపై ఆయన నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంఈఓ, డైట్, జూనియర్ లెక్చరర్లు, డిప్యూటీ ఈఓ, తదితర పోస్టులకు ప్రమోషన్లు కల్పించాలన్నారు.