మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం దుర్గంధభరితంగా మారింది. బస్టాండ్ ప్రాంగణమంతా మురుగునీటితో చెత్తాచెదారంతో జుగుప్సాకరంగా దర్శనమిస్తోంది. బస్టాండ్ లోపలికి బస్సులు వచ్చే ప్రాంతంలో మురుగునీరు పేరుకుని పోయి బీటలు వారింది. ఆ ప్రాంతంలో చెడు వాసన వెలువడుతున్న కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు ఆ ప్రాంతంలో బ్లీచింగ్ పౌండర్ చల్లాలని కోరుతున్నారు.