మహబూబ్ నగర్: దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

80చూసినవారు
మహబూబ్ నగర్: దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే
దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని తూర్పు కమాన్ దగ్గర కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో జరిగిన దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, దత్తాత్రేయ స్వామి కృపా కటాక్షం భక్తులందరిపైన మెండుగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్