నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి స్వాగతం పలికారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. మహిళలు మంగళహారతులిచ్చి స్వామి వారిని తమ వీధుల్లోకి ఆహ్వానించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, భజన మండలి సభ్యుల కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.