సంధ్య ధియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత గుప్తా సోమవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని చెప్పారు. తీవ్రంగా గాయపడిన బాలుడికి అందిస్తున్న వైద్య సేవలపై అరా తీశారు. ధైర్యంగా ఉండాలని, తప్పకుండా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.