హైదరాబాద్ బుద్ధ భవన్ లో సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులకు సంబంధించి వినతి పత్రాలను సేకరించారు. హైడ్రా నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటుందని కమీషనర్ రంగనాథ్ వెల్లడించారు.