ప్రభుత్వ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సెషన్‌కు కూడా కేసీఆర్ రాలేదు. ఈ కార్యక్రమానికి రావాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించారు. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పొన్నం ఆహ్వాన పత్రికలు అందించారు.