తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారని.. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా అమలులోకి తీసుకొచ్చామని సోమవారం సీఎం రేవంత్ అన్నారు. ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు కానీ, ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదన్నారు. అందుకే బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించామని చెప్పారు.