జగదేవ్పూర్: రాష్ట్ర సెంట్రల్ ఫోరం జాయింట్ సెక్రెటరీగా ప్రశాంత్
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సెంట్రల్ ఫోరం జాయింట్ సెక్రెటరీగా ప్రశాంత్ శుక్రవారం నియామక పత్రాన్ని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అనంతరం ప్రశాంత్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పై మాట్లాడుతానని అన్నారు.