గజ్వేల్: కులగణనను త్వరగా పూర్తి చేయాలి
సామాజిక, ఆర్ధిక, కులగణనను త్వరగా పూర్తి చేయాలని సిద్ధిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జరుగుతున్న సర్వేను పరిశీలించి, ఎన్యూమరేటర్లకు సూచనలిచ్చారు. అదేవిధంగా సర్వేకు పట్టణ ప్రజలు సహకరించి పూర్తి వివరాలు సర్వే అధికారులకు ఇవ్వాలని కమిషనర్ తెలియజేశారు.