గజ్వేల్: లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం లయన్స్ క్లబ్ స్నేహ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, నేతి శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, అజయ్, ఏళ్లంరాజు, టీచర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.