శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ను యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి నాయకులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సహకరించాలని బండ ప్రకాష్ కు వినతిపత్రం అందజేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చేలా చూడాలన్నారు.