సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన పతంగులను రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తయారు చేయించి తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో సీఎం పుట్టిన రోజు సందర్భంగా పూరీలో రేవంత్ రెడ్డి సైకత శిల్పం తయారు చేయించిన మెట్టు. ఈ దఫా సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ ఫోటోతో కూడిన పతంగులను తయారు చేయించి శనివారం హైదరాబాద్ నగరంలో పిల్లలకు పంపిణీ చేశారు.