హుస్నాబాద్: చెరువులోకి చేప పిల్లలను వదిలిన మత్స్యకారులు
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని గుండారెడ్డిపల్లి సింగరాయ ప్రాజెక్టులో మంగళవారం జిల్లా మత్స్యశాఖ అధికారి వర్దారెడ్డితో కలిసి చెరువులో గుండారెడ్డిపల్లి మరియు తంగళ్లపల్లి గ్రామాల మత్స్యకారులు చేప పిల్లలను వదిలారు. అనంతరం మత్స్యశాఖ అధికారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు, గుండారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సుతారి కనుకరాజు, సింగరాయ ప్రాజెక్టు కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.