గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రవాసీ మిత్ర రూపొందించిన గల్ఫ్ భరోసా పోస్టర్, డాక్యుమెంటరీని శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అవగాహన కల్పించేందుకే దీని రూపకల్పన. కార్యక్రమంలో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, ప్రవాసీ మిత్ర ప్రతినిధులు మంద భీమ్ రెడ్డి, పి. సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.