నానల్ నగర్ డివిజన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయించామని డివిజన్ కార్పొరేటర్ నసీరుద్దీన్ తెలిపారు. సోమవారం డివిజన్ లోక్ ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ ను అయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలకు ఆధార్ ప్రామాణికం అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సవరణలు ఉంటే చేసుకోవాలని, ఆధార్ కార్డులో వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని కార్పొరేటర్ సూచించారు.