ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు సోమవారం కూకట్పల్లిలోని శేషాద్రి నగర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని క్రైస్తవులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గ క్రిస్టియన్లకు ముందస్తు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి శాంతిని బోధించిన ఏసుక్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమన్నారు.