ఓయూలో ధర్నాలు, నిరసనలు చేయొద్దంటూ సర్క్యులర్ ఇచ్చి ఓయూ అధికారులు విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ మండిపడ్డారు. ఓయూలో సర్క్యులర్ ఎత్తివేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ఆమె పాల్గొని మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో తెలియడం లేదన్నారు. ఓయూలో సమస్యలు పరిష్కరించకుంటే తాము కూడా ఉద్యమం చేస్తామని అన్నారు.