"సీఎం గాలి మాటలకు సమాధానం అవసరమా? " – కిషన్ రెడ్డి

70చూసినవారు
హైదరాబాద్ హోటల్ తాజ్ వివంతా వద్ద గురువారం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించాయని అన్నారు. "సీఎం రేవంత్ రెడ్డి నాపై చేసిన ఆరోపణలకు ప్రజలే సమాధానం ఇచ్చారు" అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, జీవో 317 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్