గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నాయకుల బృందం బుధవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రాష్ట్రంలో గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మల్లన్న దేవాలయాలకు గొల్లకురుమలనే ఛైర్మన్లుగా నియమించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. కొమ్ము అశోక్ యాదవ్, రామ్చంద్రయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.