విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పే స్కేల్ అమలు చేయాలని జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బర్ల నారాయణ మాట్లాడుతూ భావితరానికి వేసేది విద్యాశాఖ సమగ్ర విద్య అయినప్పటికీ అదే శాఖలో పనిచేస్తున్న మేము కనీస ఉద్యోగ భద్రత లేకుండా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామన్నారు.