
నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణం.. మంత్రి సీతక్క సీరియస్
తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. నాసిరకం పనులకు క్వాలిటీ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారు? బిల్లులు ఎలా చెల్లించారు? అని మండిపడ్డారు. తక్షణం ఆయా ప్రాంతాలకు క్వాలిటీ కంట్రోల్ టీములను పంపాలని ఆదేశించారు. గ్రామీణ రహదారుల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడేది లేదని.. కాంట్రాక్టర్లు, ఏ స్థాయిలో ఉన్న వదిలే ప్రసక్తి లేదన్నారు. నాసికం పనులు చేసిన చోట సస్పెన్షన్లు తప్పవని హెచ్చరించారు.