

ట్రాప్ చేసి... ముక్కలు ముక్కలుగా నరికాడు (వీడియో)
సంగారెడ్డి జిల్లా మెగ్యానాయక్ తండాలో తన కూతురిని ప్రేమించడంతో దశరథ్ అనే యువకుడిని తండ్రి భాస్కర్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దశరథ్ను తన కూతురితో ఫోన్ చేయించి ట్రాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి హత్య చేసినట్లు తేల్చారు. మృతదేహాన్ని కాల్చే క్రమంలో అది పూర్తిగా కాలకపోవడంతో ముక్కలు ముక్కలుగా నరికి మాయం చేయడానికి యత్నించినట్లు తెలిపారు.