తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్లు తెలిపిన ఎన్ఐఎన్
పంటలకు హానీ చేసే పురుగు నివారణ మందుల వాడకం అవసరానికి మించి రైతులు వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ముఖ్యంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అతిగా వినియోగిస్తున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పెస్టిసైడ్స్ వల్ల మనుషులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, శ్వాస సంబంధిత, చర్మ, తదితర వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో పేర్కొంది.