కాకతీయ కాలువలో ఒకరి గల్లంతు
మెండోరా మండల కేంద్రానికి చెందిన చిన్న మర్రెన్న అనే వ్యక్తి బుధవారం కాకతీయ కాలువలో గల్లంతయ్యాడు. చిన్నమర్రెన్న కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో కాకతీయ కాలువపై మద్యం సేవించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్సై పేర్కొన్నారు.